
మీరు కొనుగోలు చేసే ట్రక్కులపై
యాడ్-యాన్ సర్వీసులు


అవగాహన ఉంటేనే ఎదుగుదల ఉంటుంది
ఫ్లీట్ ఎడ్జ్ ద్వారా దూరం నుంచే వాహన కదలికల లైవ్ అప్‌డేట్స్ తెలుసుకోండి
ప్రభావవంతమైన నిర్ణయం తీసుకోవడం నుంచి భవిష్యత్ ప్రణాళిక వరకు ప్రతీదానికి రియల్ టైమ్‌లో సంబంధిత సమాచారం తెలుసుకొని ఉండటం అవసరం. టాటా మోటర్స్ సొంతంగా రూపొందించిన అత్యాధునిక టెక్నాలజీ వేదిక ఫ్లీట్‌ఎడ్జ్, మీ వ్యాపారం గొప్ప విజయం సాధించేలా మెరుగైన నిర్ణయం తీసుకోవడంపై దృష్టి సారించి బలమైన, డేటా ఆధారిత, రియల్ టైమ్ వ్యాపారాన్ని నిర్మించేందుకు మీ వ్యాపారానికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చుతుంది.
1.59L+
మొత్తం యూజర్లు
3.74L+
మొత్తం వాహనాలు
456M+
మొత్తం వాహనాలు


సురక్ష వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ (AMC) గురించి
ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (FMS) గురించి
టాటా మోటర్స్ AMC సర్వీసు పేరు సురక్ష. ఇది కస్టమర్లు పూర్తిగా తమ వ్యాపారంపై దృష్టి సారించేలా చూస్తుంది, వాహన మెయింటెనెన్స్‌కు సంబంధించిన పనులన్నీ టాటా మోటర్స్ నిపుణులు చూసుకుంటారు.
వాణిజ్య వాహన కొనుగోలుదారులకు వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ (AMC)ని టాటా మోటర్స్ అందిస్తుంది. ఇది టాటా అధీకృత సర్వీస్ స్టేషన్ల (TASS) అధీకృత డీలర్ల సర్వీస్ ఔట్‌లెట్స్ ద్వారా నిర్ధిష్టం జాతీయ రహదారుల్లో కస్టమర్లకు రిపేర్, మెయింటెనెన్స్ సేవలు అందిస్తుంది.
టాటా మోటార్స్ సిఫార్సు ప్రకారం సర్వీస్ షెడ్యూల్‌లో కిలోమీటర్ల ప్రకారం సూచించిన సమయాల్లో లేబర్, విడిభాగాలు, వినియోగ వస్తువులకు సంబంధించిన మెయింటెనెన్స్ సేవలను AMC ఉచితంగా కవర్ చేస్తుంది. అయితే ఇందులొ కొన్నింటికి చెల్లింపు జరపాల్సిన బాధ్యత కస్టమర్ పై ఉంటుంది.
టాటా వాహనాలకు AMC ప్లాన్స్ కింద సిల్వర్, గోల్డ్, P2P (పే టు ప్రొటెక్ట్) వంటి రకరకాల సేవలు అందుబాటులో ఉంటాయి. ఊహించని రిపేర్ల రక్షణకు హామీ ఇచ్చే మెయింటెనెన్స్ ప్లాన్ AMC. అంతే కాదు నిర్దేశిత మెయింటెనెన్స్ సేవల విషయంలో పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేస్తుంది.


సంపూర్ణ సేవ 2.0
టాటా మోటర్స్ నుంచి మీరు ట్రక్ కొనుగోలు చేశారంటే మీరు కేవలం ఒక ఉత్పత్తి మాత్రమే కొనుగోలు చేయడం లేదు, మీరు సర్వీసు, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఇన్సూరెన్స్, విధేయత సహ ఎన్నో పొందుతారు. మీరు మీ వ్యాపారంపై పూర్తి దృష్టి సారించవచ్చు, మిగిలినవన్నీ సంపూర్ణ సేవ చూసుకుంటుంది.
సంపూర్ణ సేవ 2.0 సరికొత్త మెరుగైన సేవ. నిరంతరాయ సంపూర్ణ సేవలు అందించేలా దీనికి రూపొందించేందుకు గతేడాది మేము మా కేంద్రాలను సందర్శించిన 6.5 మిలియన్లకు పైగా కస్టమర్ల నుంచి మేము ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం.
29 రాష్ట్రాల్లోని సర్వీసు ఆఫీసులు, 1500 ఛానెల్ పార్టనర్స్, 250+ టాటా మోటర్స్ ఇంజినీర్స్, ఆధునిక పరికరాలు, సదుపాయాలు, 24x7 మొబైల్స్ వ్యాన్స్ సాయం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు.


టాటా ఓకే
వాహనాలు అమ్మాలన్నా లేదా ప్రీ-ఓన్డ్ వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటే టాటా ఓకే దానికి ఉత్తమ ఎంపిక. ఉత్తమ ధర హామీతో పాటు ఇంటి ముందుకు రావడం, ఉచిత మదింపు వంటి అనేక సేవలు అందిస్తుంది టాటా ఓకే. అమ్మకం లేదా కొనుగోలు అనుభూతి సాఫీగా ఉండేలా చూసుకోవడానికి మేము రీఫర్బిష్డ్ వాహనాల సోర్సింగ్, కొనుగోలు, మూల్యాంకనం, పునరుద్ధరణ, అమ్మకపు ప్రతి దశలోనూ మేము పాల్గొంటాము.


టాటా గురు
2008-09లో టాటా వాణిజ్య వాహనాలకు మొత్తం 6.9 మిలియన్ రిపేర్ జాబ్స్ రాగా అందులో కేవలం 2.7 మిలియన్లు మాత్రమే టాటా అథరైజ్డ్ డీలర్లు లేదా సర్వీసు స్టేషన్లకు వచ్చాయి. అంటే 60%కి పైగా పనులు టాటా మోటర్స్ చేయలేదు. అవన్నీ ప్రైవేట్ లేదా అనధికారిక వర్క్‌షాపుల్లో జరిగాయి. అక్కడ రిపేర్‌లో ఉపయోగించిన విడిభాగాలకు సరైనవో, కావో అనే హామీ కూడా లేదు. అది పూర్తిగా ఆ ప్రైవేట్ వర్క్ మెకానిక్‌పై ఆధారపడి ఉంటుంది.
సాయం కోసం ఇప్పుడే కాల్ చేయండి
సేల్స్/సర్వీస్/ఉత్పత్తికి సంబంధించిన సమస్యలపై సాయం అందుకోండి. భారతదేశవ్యాప్తంగా మా కస్టమర్లందరికి స్పేర్ పార్టులు అందుబాటులో ఉంచుతాం.
టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయండి

18002097979
